ముదిరాజుల మద్దతు మల్లయ్య యాదవ్‌కే

by Naresh |   ( Updated:2023-11-13 15:22:42.0  )
ముదిరాజుల మద్దతు మల్లయ్య యాదవ్‌కే
X

దిశ, కోదాడ టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ముదిరాజుల మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కేనని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గుండ్లపల్లి శ్రీను అన్నారు. సోమవారం కోదాడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ముదిరాజులంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని, కోదాడలో మల్లయ్య యాదవ్ కు ఓట్లు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి వెంకన్న, నారాయణపురం సర్పంచ్ తమ్మనబోయిన శంకర్ రావు, ధనుంజయ్, లింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

అనంతగిరి మండలం వెంకట్రాంపురానికి చెందిన పలువురు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కోదాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, నాయకులు బోలికొండ జయరాజు, సోమపంగు నాగేశ్వరరావు, సూదుల రాములు, కొండపల్లి రవి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story