నేటితో ముగియనున్న గడువు.. అధికారుల చర్యల పై సర్వత్రా ఆసక్తి

by Mahesh |
నేటితో ముగియనున్న గడువు.. అధికారుల చర్యల పై సర్వత్రా ఆసక్తి
X

దిశ, చండూరు: మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు అక్రమంగా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ప్రజలలో విపరీతమైన చర్చ జరగడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు ఈ నెల 3 వ తేదీన నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందించినప్పటి నుండి 7 రోజుల్లో జిల్లా విగ్రహ ఏర్పాటు కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని లేనిచో చర్యలు తీసుకుంటామని అందులో తెలిపారు. నేటితో గడువు ముగుస్తుండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మాత్రం మరికొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందిని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story