- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివరాత్రి జాతరకు శంభులింగేశ్వరుడిని చూద్దాం రండి
దిశ, మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఉన్న ఇష్ట కామేశ్వరీ సహిత స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని సుమారు 12 వందల సంవత్సరాలకు పూర్వం బన్న అనే భక్తుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శాసనంలో రాసి ఉంది. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1989 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అప్పటి శాసనసభ్యుడు వేనేపల్లి చందర్రావు ఆధ్వర్యంలో ఆనాటి దేవాలయ పాలక మండలి చైర్మన్ ఇరిగెల పోల్ రెడ్డి, గుండ్లపల్లి చంద్రమ్మ ఆధ్వర్యంలో నూతన ఆలయానికి అంకురార్పణ జరిగింది.
బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు
శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి 12 వరకు శివరాత్రి పండుగ సందర్భంగా నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి అధికారులు గత 15 రోజులుగా సమీక్ష సమావేశాలతో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దేవాదాయశాఖ , ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఆలయంలోని శివలింగం ప్రత్యేకత .....
మేళ్లచెరువు శివాలయంలో పూజలందుకుంటున్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవాలయం చుట్టూ పక్కల తవ్విన నీరు పడని పరిస్థితుల్లో ఈ శివలింగంపై నీరు ఉండటం ఇక్కడ లింగం విశిష్టత .
ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ....
ఇక్కడి ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాలలో మహాశివరాత్రి జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి, ఎత్తైన రంగురంగుల లైటింగ్ ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు వీటిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు దేవాలయం వద్దకు చేరుకుంటారు.
భక్తుల కొరకు ఏర్పాట్లు పూర్తి....
మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుందని సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ, ఆలయ అభివృద్ధి కమిటీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ, పోలీస్, నీటిపారుదల, ఆర్ అండ్ బితో పాటు పలు శాఖల అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పా ట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారిపై వాహనాల నిలుపుదల చెయ్యకుండా చర్యలు, వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, దేవాలయ ప్రాంగణంలో భారీ క్రేన్లు ఏర్పాటు చేసి భక్తులు క్యూ పద్ధతిలో స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లతో పాటు దేవాలయ ప్రాంగణం చుట్టూ పక్కల వాహనాలకు అనుమతులు లేకుండా కేవలం కాలినడక ద్వారానే భక్తులు దేవాలయానికి వచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఎద్దుల పందాలు, కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు
కబడ్డీ, ఎద్దుల పందాలు ప్రదర్శనలకు ప్రత్యేక స్థలాలలో ఏర్పాటు, భక్తులకు మంచినీటి సౌకర్యాన్ని, అన్నదాన కార్యక్రమాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యాలు....
మేళ్లచెరువు జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ డిపోల నుంచి కోదాడ, హుజూర్నగర్ మీదుగా మేళ్లచెరువు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాట్లు చేస్తున్నారు.