- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత హాస్టల్ అంటూ విద్యార్థులకు బురిడీ..
దిశ, సూర్యాపేట ప్రతినిధి: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాల హాస్టళ్లకు అనుమతులు లేవు. అయినా ప్రైవేటు కళాశాలలకు అనుబంధంగా ప్రైవేటు హాస్టల్స్‌ను నడపుతున్నారు. అనుమతులు తీసుకోకుండా నడుపుతున్న ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు జంకుతున్నారు. అనుమతులు తమ పరిధి కాదు అని, ఇంటర్మీడియట్ బోర్డు నుంచి నేరుగా ప్రైవేటు జూనియర్ కళాశాల నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలంటూ పేర్కొంటున్నారు.
పర్మిషన్ ఒకచోట బిల్డింగ్ మరోచోట..
సూర్యాపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాల కు అనుమతులు కొత్త కలెక్టరేట్ రోడ్డు దగ్గర ఉన్న బిల్డింగ్ కు అనుమతులు ఇచ్చారు. అయితే అనుమతులను తుంగలో తొక్కిన ఆ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ల రోడ్డు లో ఉన్న ఒక బిల్డింగ్‌లో భవిత జూనియర్ కళాశాలను నడుపుతున్నారు. అనుమతులు ఒక బిల్డింగ్ కు తీసుకొని, మరోచోట కళాశాల ను నడుపుతున్నారు. భవిత జూనియర్ కళాశాల కు ఎలాంటి హాస్టల్ అనుమతి లేదు. అయినా అక్రమంగా హాస్టల్స్‌ను నడుపుతున్నారు. తాజాగా ఆదివారం హాస్టల్ ప్రహారీ గోడ కూలిపోయి 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇద్దరి విద్యార్థులు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని హైదరబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుమతులు లేని హాస్టల్స్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో భవిత జూనియర్ కళాశాల యాజమాన్యం చెలగాటమడుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా నడుపుతున్న భవిత జూనియర్ కళాశాలకు గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకోని ఒక్కరోజు గడుస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ఆ హాస్టల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరును కూడా పరిశీలించడానికి వీరికి తీరిక లేదు.
హాస్టల్స్‌కి అనుమతులు లేవు
సూర్యాపేట జిల్లాలో మొత్తం 33 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా, సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 11 వరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టల్స్ అనుమతులు ఏ ఒక్క ప్రైవేటు జూనియర్ కళాశాల కు లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. అయినా ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యం సొంత భవనం, హాస్టల్స్ సౌకర్యం కలదు అంటూ విద్యార్థులకు ఊదరగొట్టి, అధిక ఫీజులు లాగుతున్నారు. కేవలం కళాశాల కు మాత్రమే రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అనుమతులు తీసుకుని, కళాశాలతో పాటుగా హాస్టల్స్ సైతం నడుపుతున్నారు.
విద్య ముసుగులో ప్రైవేటు జూనియర్ కళాశాలల నిర్వాహకులు ఈ తరహా దందాకు పాల్పడుతున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యం చుక్కలు చూపిస్తున్నారు. కళాశాల ఫీజు తో పాటుగా, హాస్టల్స్ ఫీజు అంటూ అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యార్థులకు ఇష్టం లేకపోయినా, తమ కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే కచ్చితంగా తమ హాస్టల్స్ ఉండాలని నిబంధన పెడుతున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండవ సంవత్సరం విద్యార్థులకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు.
విద్యార్థులకు బురిడీ
విద్యార్థులకు ప్రైవేటు జూనియర్ కళాశాలలో నూతనంగా అడ్మిషన్ పొందుతున్న సమయంలోనే ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యం విద్యార్థులను బురిడీ కొడుతున్నాయి. విశాలమైన సొంత భవనం, ఆటస్థలం, ల్యాబ్లు, కళాశాలలోనే హాస్టల్ సౌకర్యం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఊదరగొట్టి, విద్యార్థులను సులభంగా తమ బుట్టలో వేసుకుంటున్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హాస్టల్స్ ఉంటే ఒక ఫీజు, రెండోవ సంవత్సరం విద్యార్థులకు మరో ఫీజు లాగుతున్నారు. ఇన్ని వేల కి వేలు ఫీజులు తీసుకుంటున్న కనీసం హాస్టల్లో విద్యార్థులకు రక్షణ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కళాశాల హాస్టల్స్ పై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
హాస్టల్స్‌కి పర్మిషన్ లేవు
జిల్లా కేంద్రంలో నడిపిస్తున్న జూనియర్ కళాశాల హాస్టల్స్‌కి పర్మిషన్ లేవు. ఆదివారం భవిత కాలేజీలో జరిగిన సంఘటన నిమిత్తం కొత్త కలెక్టరేట్ రోడ్‌లో ఉన్న భవిత కాలేజీకి తనిఖీల కోసం వచ్చాము. స్థానిక 60 ఫీట్ రోడ్ లో ఉన్న భవిత కాలేజీకి ఎలాంటి పర్మిషన్ లేవు. హాస్టల్స్ కోసం ఎవరు కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేయలేదు. వాళ్ల అండదండలను బట్టి హాస్టల్స్ ను ఏర్పరచుకుంటున్నారు. హాస్టల్స్‌పై తనిఖీలు చేయడానికి మాకు ఎలాంటి అధికారాలు లేవు. -జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కృష్ణయ్య...