- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు : ఆర్డీవో

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికేట్ అవసరం లేదని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన భువనగిరిలో మీసేవ నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు పొడిగించిందన్నారు. దీనిలో భాగంగా 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీసేవ నుంచి కుల ధృవీకరణ సర్టిఫికేట్ తీసుకుంటే ఇప్పుడు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. లేని వాళ్లు మాత్రమే కొత్త సర్టిఫికెట్స్ కోసం ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెల్ల రేషన్ కార్డు లేకపోతేనే నూతన ఇన్ కమ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఖచ్చితంగా మీ సేవ నిర్వహకులు అభ్యర్థులకు వెల్లడించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్న వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తహశీల్దార్లు, ఆర్ఐలు వీటిపై ఎప్పటి కప్పుడు మీ సేవలలో తనిఖీలు నిర్వహిస్తుండాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పై అభ్యర్థులకు ఉన్న సందేహాలను మీసేవ నిర్వాహకులు నివృత్తి చేయాలని ఆదేశించారు.