లగచర్ల రైతుల పై అక్రమ కేసులు ఎత్తివేయాలి.. మాజీ ఎంపీపీ

by Sumithra |
లగచర్ల రైతుల పై అక్రమ కేసులు ఎత్తివేయాలి.. మాజీ ఎంపీపీ
X

దిశ, భూదాన్ పోచంపల్లి : లగచర్ల రైతుల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లగచర్ల ఘటనకు నిరసనగా అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు బేడీలు వేసి జైళ్ళలో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.

రైతుల కుటుంబాలను హింసించడం దారుణమని, రైతుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటీ సుధాకర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్ సామల మల్లారెడ్డి, కుడికాల అఖిల బలరాం, నాయకులు నోముల మాధవరెడ్డి, గుణిగంటి మల్లేష్ గౌడ్, కర్నాటి అంజమ్మ, చిలువేరు బాల నరసింహ, చింతకింది కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed