- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా
దిశ, నేరేడుచర్ల / చింతలపాలెం: ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని బీజేపీ పార్టీ హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరేడుచర్ల పట్టణ కేంద్రంతోపాటు చింతలపాలెం మండలంలోని యర్రగుంట తండా, పీక్లా నాయక్ తండా, కిష్టాపురం, నక్కగూడెం చింత్రియాల, రెబెల్లే, తమ్మాపురం గ్రామాలలో ఇంటింటికి తిరిగి బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే రైతులకు వరి మద్దతు ధర రూ.3100 లు ఇస్తామని తెలిపారు.
డిగ్రీ చదువుకునే అమ్మాయిలకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందజేస్తామని, మహిళా రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి, బూత్ అధ్యక్షులు కాంపల్లి నారాయణరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు లింగరాజు, నాయకులు పత్తిపాటి విజయ్, కొమ్ము రమేష్, హనుమంతరావు, అజ్మీరా శ్రీరామ్,షేక్ జానీ, తోట మహేష్, మామిడి వెంకటేశ్వర్లు, కె. నగేష్, టి. రామారావు, నర్సింహరావు శంకర్ రెడ్డి, సమ్మెట నాగరాజు, చింతల శ్రవణ్, లెనిన్, టి. శ్రీకాంత్, కాలం నాగయ్య, వేణు, కిరణ్ రెడ్డి, కాలం సైదులు పాల్గొన్నారు.