- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను ఆదరించిన వారిని మర్చిపోను
దిశ, తుంగతుర్తి: తనను ఆదరిస్తున్న ప్రజానీకాన్ని ఎన్నడు మర్చిపోనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పేర్కొన్నారు. 22 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో మీలో ఒకరినయ్యానని అన్నారు. అందులో భాగంగానే తాను ఈ స్థాయికి చేరానని, తుంగతుర్తి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు మహాదేవర లింగస్వామి ఆలయంలో అర్చకులు ఎర్ర హరికిషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు చేశారు.అంతకుముందు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమకారుడి నైన తనను సబ్బండ జాతులన్నీ ముందుకు నడిపి 51 వేల మెజార్టీతో గెలిపించి తుంగతుర్తి చరిత్రను తిరగరాసారని అన్నారు. అంతేకాకుండా తుంగతుర్తి పట్టణం నుండే 1800 మెజార్టీ తనకు రావడం మర్చిపోనని అన్నారు. ముఖ్యంగా దైవభక్తి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజలకు మహాశివరాత్రితో పాటు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్రావు, సీనియర్ రాజకీయ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, అజయ్, కొండరాజు, పెండెం రామ్మూర్తి, ఉప్పుల రాంబాబు, అక్కినపల్లి రాములు, తదితరులు పాల్గొన్నారు.