- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు : శానంపూడి
దిశ, హుజూర్ నగర్: జనంలోనే ఉన్నా జనం కోసమే పనిచేస్తా అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో 27 వార్డు దీక్షిత్ నగర్, పూసల కమిటీ నుంచి వివిధ పార్టీలకు చెందిన 95 కుటుంబాలు అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ చేరారు. వారికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని ఈ అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తాను ఎప్పుడూ ఎమ్మెల్యే అని గొప్పగా ఫీల్ కాలేదని తానెప్పుడు సైదన్న నేనని అన్నారు. తాను జనంలోనే ఉన్నానని జనం కోసమే పనిచేస్తున్న అని నియోజకవర్గానికి ఎప్పుడు అందుబాటులోనే ఉన్నానని నాపై నమ్మకం ఉంచి అసెంబ్లీ ఎన్నికల అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి, మూడవసారి సీఎం కేసీఆర్ కు, ఎమ్మెల్యేగా తనకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ రెడ్డి,కౌన్సిలర్ యరగాని గురవయ్య, తెప్పని రాములు, తెప్పని మట్టపల్లి, నాయిని శ్రీనివాసరావు, తెప్పని గురుమూర్తి,తోట చిన్న సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.