ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది

by Naresh |
ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది
X

దిశ, హుజూర్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి విషయంలో ప్రాధాన్యత కల్పిస్తుందని కోదాడ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఎంపీపీ ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి మాట్లాడుతూ... మహిళలు ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలను ఆర్థిక అసమానతలు లేకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు మద్దతు అందించాలన్నారు. దేశంలో మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. మహిళా చట్టాలు సమర్థవంతంగా అమలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోముల శివారెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చావా కిరణ్మయి, ఎంపీడీఓ లావణ్య, సీతమ్మ, ఉష, కవిత, తన్నీరు మల్లికార్జున రావు, కుందూరు శ్రీనివాస్ రెడ్డి , సింగారపు సైదులు, గురవయ్య, కుంట సైదులు, గిజా కుమారి, సావిత్రి, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed