- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బండి సంజయ్‌పై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తాజాగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. బండి సంజయ్ విషయంలో తనకు బాధ కలిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పార్టీ కోసం అనలేని కృషి చేశారని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఊపుతెచ్చిన వ్యక్తి బండి సంజయ్ అని కొనియాడారు. అయితే బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు పాటించాలని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో తాను ఓడిపోయినా.. నైతికంగా విజయం సాధించానని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Read more : disha newspaper