- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేసి అనుమతులు రద్దు చేయాలి..కలెక్టరేట్ ముందు ధర్నా
దిశ,సూర్యాపేట కలెక్టరేట్ : సీపీఐ(ఎం -ఎల్ )మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న ఎన్ ఎం కె ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపి వేసి అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల రావి పహాడ్, కోట పహాడ్, శెట్టి గూడెం,కూడలి,సర్వారం, బుర్కచర్ల గ్రామాలతో పాటు చుట్టుపక్కల తండాలు ఫ్యాక్టరీ చుట్టూ పది కిలోమీటర్ల వరకు భూమి నీరు వాయు కాలుష్యం ఏర్పడడం వల్ల ప్రజలు శ్వాసకోశ, చర్మ, క్యాన్సర్ అనేక వ్యాధులకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర,జిల్లా నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.