ఎంపీపీ చొరవతో ఐకేపీ ఉపకేంద్రం ఏర్పాటు..

by Sumithra |
ఎంపీపీ చొరవతో ఐకేపీ ఉపకేంద్రం ఏర్పాటు..
X

దిశ, కోదాడ : ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన రైతులు గత 20 రోజులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అధికారులకు పలుమార్లు రైతులు విన్నవించుకున్నారు. స్థానిక ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం జిల్లా అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తప్పనిసరిగా దగ్గరలో ఉన్న అమీనాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించి అలాట్మెంట్ చేస్తామని అధికారులు ఎంపీపీ హామీ ఇచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా దృష్ట్యా వాతావరణం మార్పుల కారణంగా తక్షణం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ శనివారం రైతులు ఏకమై గ్రామంలో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు.

విషయం తెలుసుకున్న ఎంపీపీ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో చరవాణిలో మాట్లాడి సమస్య తీవ్రతను తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ఐకేపీ ఉపకేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో, అమీనాబాద్, అనంతగిరి ఐకేపీ కేంద్రాల నుండి రైతులకు గన్ని సంచులను పంపిణీ చేశారు. అంతే కాకుండా వాయిలసింగారం గ్రామానికి స్థానిక తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఏపీఎం లక్ష్మితో కలిసి గ్రామంలో ఆరబోసిన ధాన్యపు రాసులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం రెండు కేంద్రాలకు అలాట్మెంట్ చేశామని రైతులు ఇక పై ఇబ్బంది పడవలసిన అవసరం లేదని తెలిపారు. అవసరమైతే ఇంకా అదనపు సంచులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చొరవ తీసుకునీ సమస్య పరిష్కారం చూపిన ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లను రైతులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed