తాగునీటి సమస్య లేకుండా చూడాలి

by Sridhar Babu |
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
X

దిశ,చౌటుప్పల్ : తాగునీటి సమస్య లేకుండా చూడాలని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా కేటాయింపులు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మిషన్ భగీరథ తాగునీటి కేటాయింపులు జరగలేదని అన్నారు. ఆయన నివాసంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ గ్రిడ్ పనుల తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

లింగోటం నీటి శుద్ధి కేంద్రం నుండి మునుగోడు నియోజకవర్గానికి జరిగే నీటి సరఫరా ఎలా ఉంది? ఎంతవరకు సరిపోతుంది.? ఇంకా ఎంత అవసరం ఉందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోటార్ల కెపాసిటీ పెంచాల్సి ఉంటుందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ప్రపోజల్స్ పంపించాలని ఆదేశించారు. రాబోయే కాలంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని కోరారు. వచ్చే వేసవి వరకు నియోజకవర్గంలో తాగునీటి కొరత లేకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించాలన్నారు.

Advertisement

Next Story