తాగునీటి ఇబ్బందులు..

by Naresh |
తాగునీటి ఇబ్బందులు..
X

దిశ, చిలుకూరు: దాదాపు 500 కుటుంబాలు నివసించే ప్రాంతానికి నీటి సమస్య ఏర్పడడంతో స్థానిక గ్రామపంచాయతీ అక్కడి ప్రధాన నీటి వనరైన బావికి పూడికతీత ప్రారంభించింది. చిలుకూరులోని జేజే నగర్ లో దశాబ్దాలుగా నీటినందిస్తున్న బెడం బావిలో పూడిక చేరడంతో గత కొన్ని రోజులుగా స్థానికులు నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎంపీటీసీ వడ్డేపల్లి కల్యాణి కోటేశ్ స్థానికులతో కలిసి ఎంపీడీవో, జీపీ కార్యదర్శి షరీఫుద్దీన్‌కు సమస్య పరిష్కరించాలని కోరారు. స్పందించిన అధికారులు బుధవారం నుంచి బావి పూడికతీత పనులు ప్రారంభించారు.

నీటి వృథాను అరికట్టాలి..

జేజే నగర్ లోని కొందరు నీటిని వాడుకున్నాక టాప్ బంద్ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో నీరంతా వృథాగా డ్రైనేజీలోకి వెళుతోందని వారు అంటున్నారు. మార్చిలోనే నీటి కష్టాలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింతగా ఉండే ప్రమాదముంది. నీటి వృథాను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed