- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ వార్తకు స్పందన..రంగంలోకి దిగిన అధికారులు
దిశ,తుంగతుర్తి:“కొనుగోలు కేంద్రంలో దొంగలు పడ్డారు” అంటూ శనివారం ఉదయం “దిశ” వెబ్ పేజీలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.ఈ మేరకు డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి ఆంజనేయులు,రత్తయ్యతో పాటు..తుంగతుర్తి తహసిల్దార్ దయానందంలు తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి గ్రామ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడారు.కొనుగోలు కేంద్రంలో ధాన్యం దొంగతనానికి గురవుతోందని,తూకం వేస్తున్న ధాన్యం బస్తా ఒక్కంటికి రూ.5 వసూలు చేస్తున్నారని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.కేంద్ర నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో తమను ఇబ్బందులు పెడుతున్నారని అధికారులకు వివరించారు.దీంతో అధికారులు స్పందించి కేంద్ర నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బస్తా ఒక్కంటికి రూ.5 చొప్పున వసూలు చేసిన డబ్బులను సంబంధిత రైతులకు తిరిగి ఇప్పించారు. ధాన్యం దొంగతనం విషయంపై పలు సూచనలు చేశారు.వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు తెలిపారు. ఇకముందు రైతులకు ఇబ్బందులు పెట్టే పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.అవసరమైతే కేంద్రం నిర్వాహకులను మారుస్తామని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని ఆదేశించారు.