పంట రుణాలకే అధిక ప్రాధాన్యతనివ్వాలి: కలెక్టర్ యస్.వెంకట్రావు

by Shiva |
పంట రుణాలకే అధిక ప్రాధాన్యతనివ్వాలి: కలెక్టర్ యస్.వెంకట్రావు
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ యస్.వెంకట్రావ్ బ్యాంకర్లు, జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఆయన బ్యాంకర్ల తో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆ దిశగా బ్యాంకర్లు కూడా పంట రుణాలను అధిక ప్రాధాన్యనివ్వాలని సూచించారు. జిల్లాలో 70 శాతం పైబడి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అదేవిధంగా వాటి అనుబంధ రంగాలకు రుణాల మంజూరు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన తెలిపారు.

జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రూ.715.79 కోట్ల రుణాలు టార్గెట్ కాగా ఇప్పటి వరకు రూ.533.89 కోట్ల రుణాలు మంజూరు చేశామని, మిగిలిన రుణాలు మార్చి నెలఖరు వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ, వ్యవసయేతర, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగాల్లో లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి వారి ఆర్ధిక స్వాలంబనకు తోడ్పాటు అందించాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.2,452.40 కోట్లకు గాను రూ.1,928 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రుణాల లక్ష్యం రూ.1,217 కోట్లు కాగా, రూ.1,506 కోట్ల రుణాలు మంజూరు చేశామని, పరిశ్రమల రంగంలో లక్ష్యం రూ.395 కోట్లు కాగా 614 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు.

విద్యా రుణాలు టార్గెట్ రూ.32.83 కాగా రూ.13.63 కోట్ల రుణాలిచ్చామని, గృహ రుణాల టార్గెట్ రూ.180.03 కోట్లు కాగా, రూ.51.58 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా, ఇతర ప్రాజెక్టులు, వివిధ సెక్టర్ల కింద లక్ష్యం రూ.4,794.28 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.5,426.26 కోట్ల రుణాలు మంజూరు చేశామని ఇప్పటి వరకు అన్ని రంగాల్లో 114 శాతం వృద్ధి రేటును సాధించామని ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రుణా లక్ష్యం 4,700.68 కోట్లకు గాను 5,374.68 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు.

రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక, టర్మ్ లోన్లు, సూక్ష్మ, చిన్న తదితర రుణాల లక్ష్యాలు మరియు సాధించిన ప్రగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. అలాగే జిల్లాలో మార్చి కి ముందే బ్యాంకర్లు తమ లక్ష్యాన్ని అధిగమించినందుకు వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సమావేశంలో లీడ్ బాంక్ మేనేజర్ బాపూజీ, ఆర్బీఐఏ జీఎం సాయిచరణ్, నాబార్డ్ ఏజీఎం సత్యనారాయణ, ఎస్ బీ ఐ ఏజీఎం కృష్ణ మోహన్ , ఏపీజీవీబీ ఏజీఎం విజయ భాస్కర్, ఎస్ బీ ఐ డీజీఎం మురళి, జిల్లా అధికారులు రామారావు నాయక్, శ్రీధర్ గౌడ్, తిరుపతయ్య, శిరీష శ్రీనివాస్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed