హామీలు అమలులో కాంగ్రెస్ విఫలం.. బీజేపీ

by Sumithra |
హామీలు అమలులో కాంగ్రెస్ విఫలం.. బీజేపీ
X

దిశ, రాజాపేట : కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాజపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వచ్చే నెల 3వ తేదీన ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గురించి సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూర్ అశోక్ గౌడ్, మండల అధ్యక్షులు దాచేపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల రామచందర్, మాజీ ఉపసర్పంచులు బూరుగు శేఖర్ రెడ్డి, బింగి శ్రీనివాస్, దాచేపల్లి శ్రీనివాస్, మెండు భగవాన్ రెడ్డి, మేకల రమేష్, ఎర్ర గోకుల వినోద్, శివరాములు, సాధన బోయిన శంకర్, శ్రీశైలం, రంగ నరేష్, మై కోటి రాజు, కాకల నవీన్, వట్టెం శ్రీకాంత్, వెంకటేష్, రవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story