- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
దిశ, నకిరేకల్ : ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయకుండా తమ ఇష్టం వచ్చినట్లు నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో నకరేకల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. గ్రామాలలో రైతులకు సమస్యలు సృష్టించి లక్షల రూపాయలను దండుకుంటున్నారని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ల చుట్టూ రైతులు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పేరిట బెదిరించి సంతకాలు చేశారని, చైర్మన్ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. పరిపాలన అధికారుల చేతుల్లో లేకుండా విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇంటిదగ్గర కూర్చొని ఎవరికి బిల్లులు రాకుండా తీర్మానం చేయడం ఆటవిక పాలన సాగించడం వంటిది అన్నారు. అవిశ్వాసం పేరిట, బెదిరింపుల పేరిట పోలీస్ స్టేషన్లను వేదికగా పెట్టుకొని పరిపాలన సాగిస్తే ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.