- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే వీరేశంను దూషించిన రిపోర్టర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన మ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు
దిశ, నల్లగొండ క్రైం: సోషల్ మీడియా వేదికగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను పరుష పదజాలంతో దూషించిన ఐ న్యూస్ రిపోర్టర్ కిరణ్ వరకాంతంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘం నాయకులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను కలిసి శనివారం పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిజం ముసుగులో ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా దూషించడం తగదన్నారు. ఒక వర్గాన్ని నెత్తినెత్తుకోవడం, మరో వర్గాన్ని కించపరుచొద్దని అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశానికి, మాదిగ సమాజానికి ఐ న్యూస్ రిపోర్టర్ కిరణ్ వరకాంతం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు పోలీస్ శాఖ తీసుకునే వరకు ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ, జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్, పెరిక ఉమామహేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సమ్మె, చింతా శివశంకర్, కందుల మోహన్, ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి కొంపల్లి రమేష్ కత్తుల తులసీదాస్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ బోడ స్వామి, మాచర్ల సైదులు, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రూప, మారపాక నరేందర్, కుడతాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.