- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA, Collector : మొక్కల సంరక్షన అందరి భాధ్యత..
దిశ, మిర్యాలగూడ : ప్రజలందరి సహకారంతోనే జిల్లాను పచ్చదనంగా మార్చవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలోని ఈద్గా సమీపంలో నిర్వహించిన నేను నా మిర్యాలగూడ వనమహోత్సవ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని అన్నారు. అందరి సహకారం ఉంటేనే జిల్లాను పచ్చదనం జిల్లాగా మార్చవచ్చని పేర్కొన్నారు. మొక్కలు నాటించడంలో ఎమ్మెల్యే ముందు ఉండడం హర్షించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, నూకల వేణుగోపాల్ రెడ్డి, తమ్ముడు బోయిన అర్జున్, కొమ్ము శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.