- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన నల్లగొండ జిల్లా కీలక నేత!
దిశ, నల్లగొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి.. ఉద్యమం సమయంలో తన సొంత ఆస్తులను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం కోసం పనిచేసిన నల్లగొండ జిల్లాకు చెందిన సర్దార్ చకిలం శ్రీనివాసరావు కుమారుడు చకిలం అనిల్ కుమార్‌కి మరోసారి ఆశ భంగం కలిగింది. ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్న ఆయనకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ నెలలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చకిలం అనిల్ పేరు లేకపోవడంతో నిరాశకు గురైన ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం.
నిజంగానే చకిలం అనిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. తెలంగాణ కోసం పోరాడిన చకిలం అనిల్‌కు మరోసారి ఎలాంటి పదవి దక్కకపోవడంతో గుర్రుగా ఉన్న ఆయన అభిమానులు.. అనిల్‌కు జరిగిన అన్యాయాన్ని ఓట్ల రూపంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు చూపిస్తామంటున్నారు.
కాంగ్రెస్‌లోకి చకిలం..?
బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న చకిలం అనిల్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ తండ్రి చకిలం శ్రీనివాసరావు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి నల్లగొండ ఎంపీగా, పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి సొంత క్యాడర్ అప్పట్లో బలంగా ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో చకిలం అనిల్ కాంగ్రెస్‌లోకి వెళ్తే ఆయన తండ్రి అభిమానులు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతోనే చకిలం అనిల్ హస్తం పార్టీలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నల్లగొండ జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.