నేడు సుంకిశాలకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం

by Nagam Mallesh |
నేడు సుంకిశాలకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం
X

దిశ, నాగార్జునసాగర్: సుంకిశాల వివాదం చిలికి చిలికి తుఫాన్ లాగా మారుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం దాహార్తీ తీర్చే సుంకిశాల తాగునీటి పథకం చుట్టూ రాజకీయ వివాదం ఇంకా ముదురుతోంది. సుంకిశాల పంప్ హౌజ్ నీట మునగడానికి కారణం ఎవరన్నదానిపై పరస్పరం విమర్శలు దాడి చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కమిషన్ వేస్తామని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు సీన్ లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల బృందం నేడు సుంకిశాల ప్రాజెక్టును పరిశీలించడానికి వస్తోంది. ఇటీవల కూలిపోయిన రిటైలింగ్‌వాల్‌ను పరిశీలించనుంది. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సీన్ లోకి బీజేపీ ఎంట్రీతో సుంకిశాల చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story