MLA Kumbham Anil Kumar Reddy : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

by Sumithra |
MLA Kumbham Anil Kumar Reddy : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భవనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం భువనగిరి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. పట్టణంలో ప్రగతి నగర్ లో అమృత్ 2.0 పథకంలో రూ 21.80 కోట్లతో మంజురైన వాటర్ ట్యాంకులు, వాటర్ సప్లై పైపులైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఏరియా హాస్పిటల్ లో ఐసీయూ బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ను సందర్శించారు. అందులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలో గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జిండగే, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మాయ దశరథ, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డితో‌ పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed