- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో బీసీ నినాదం.. కచ్చితంగా టికెట్ కేటాయించాలని డిమాండ్
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు నెలల క్రితం డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హస్తం పార్టీని వీడి అధికార పార్టీలో చేరిన నాటి నుంచి భువనగిరి కాంగ్రెస్ లో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. భువనగిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పరిధిలో టికెట్టును బీసీలకే కేటాయించాలని నినాదం మొదలవడం, అనిల్ కుమార్ రెడ్డి పార్టీని వీడడం, జిట్టా బాలకృష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, తిరిగి అనిల్ కుమార్ రెడ్డి మరో మారు హస్తం గూటికి చేరడం.. ఇలా విభిన్నమైన రాజకీయాలు భువనగిరిలో చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్య నాయకులను కలిసిన భువనగిరి బీసీ నేతలు..
అనిల్ కుమార్ రెడ్డి తిరిగి అధికార పార్టీని వీడి హస్తం గూటికి చేరిన మరునాడే భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ లతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ముందు నుంచి కోరుతున్న విధంగా రానున్న ఎన్నికలలో భువనగిరి అసెంబ్లీ సీటును తప్పకుండా బీసీ నాయకులకే కేటాయించాలని వారు కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సైతం భువనగిరి నేతలు కలవనున్నట్లు సమాచారం. భువనగిరి అసెంబ్లీ సీటును బీసీల కేటాయించాలని పోత్నక్ ప్రమోద్ కుమార్, పంజాల రామాంజనేయులు గౌడ్, పచ్చి మట్ల శివరాజ్ గౌడ్, తంగేళ్లపల్లి రవికుమార్ లు గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
నేడు ఢిల్లీకి..
భువనగిరి అసెంబ్లీ సీటు బీసీలకే కేటాయించాలని కోరుతూ భువనగిరి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఏఐసీసీ ముఖ్య నాయకులను కలిసి తమ అభ్యర్థనలను విన్నవించుకోనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ టికెట్ ను బీసీలకు కేటాయిస్తే తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకాన్ని అధిష్టానంలో కల్పించడానికి వీరంతా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముదురుతున్న "బీసీ" నినాదం..
ఇక్కడ ప్రధానంగా అనిల్ కుమార్ రెడ్డి అధికార పార్టీని వీడి తిరిగి సొంత గూటికి చేరుకున్న మరునాడే భువనగిరి కాంగ్రెస్ లో బీసీ నేతలు సమావేశం కావడం గమనార్హం. అయితే గత కొన్ని నెలల నుంచి భువనగిరి కాంగ్రెస్ లో బీసీ నినాదం వినిపిస్తుంది. మరో మారు వీరంతా సమావేశమై ముఖ్య నాయకులను కలవడం, ఢిల్లీకి వెళ్తుండడంతో ఈ నినాదం మరింత ముదురుతున్న ట్లు నాయకులు భావిస్తున్నారు.