- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యో రామ రామ బలహీన రైతన్నలకు దిక్కెవరు....?
దిశ,పెన్ పహాడ్: అసలే ఎండాకాలం.... ప్రస్తుతం నీరు లేక కొన్ని గ్రామాల్లోని చెరువులు ఎండిపోతున్నాయి. అయితే ఉన్న నీటిని కూడా కొందరు బడా రైతులు పంట పొలాల కోసం కాలువలు తవ్వి కొందరు అక్రమార్కులు మోటార్లతో బయటకు వదులుతున్నారు. పెన్ పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలో ఉన్న పెద్ద చెరువు సుమారు 36 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. ఆయకట్టు కింద దాదాపు 100 ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయి. అలాంటి ఈ చెరువు నీటిని కొందరు రైతులు తమ పంట పొలాలకు మళ్లించేందుకని దుర్మార్గంగా గత కొన్ని రోజులుగా పెద్ద పెద్ద మోటర్లను పెట్టి బయటకు వదులుతున్నారు. నీటిని బయటకు పంపడానికి ఏకంగా జేసీబీలతో కాలువలను తవ్వి వారి స్వంత భూముల వలే నీటిని వదులుతున్నా కనీసం అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
దీంతో చెరువు చుట్టూ పక్కన ఉన్న రైతులు అధికారులకు ఫిర్యాదు చేసిన అక్రమార్కులకు అండగా అధికారులు నిలుస్తున్నారు. కనీసం వేసవి సమయంలో నైనా పశువులు తాగడానికి నీరు చెరువులో ఉండేలా చూడాలని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారులు పట్టించుకోక పోగా మమ్మల్ని బెదిరిస్తున్నారు..... బండి వెంకటరెడ్డి, గాజుల మల్కాపురం
అక్రమంగా చెరువు నీటిని తరలిస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తే అక్రమార్కులకు మద్దతు ఇస్తూ కేసులు పెడతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకొని నీటిని తరలించకుండా చూడాలి. చెరువు నీటిని తరలించకుండా చూడాల్సిన ఇరిగేషన్ అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తుండడం దుర్మార్గం...కనీసం వేసవికాలంలో నైన పశువులు తాగడానికి నీరు లేకుండా చెరువును ఖాళీ చేస్తున్నారు... అధికారుల మద్దతుతోనే ఇలా చేస్తున్నారు... వారిపై చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదు చేస్తే దారి ఖర్చులు ఇవ్వమంటున్నారు… బచ్చలకూరి వెంకులు, గాజుల మల్కాపురం రైతు.
చెరువు నీటిని తరలిస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎండలో అక్కడికి రావాలంటే దారి ఖర్చులు ఇవ్వాలని అడుగుతున్నారు... రైతుల గోసను పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.