- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
830 రైతులకు 5.30 కోట్ల రుణమాఫీ.. సొసైటీ చైర్మన్..
by Sumithra |
X
దిశ, తుంగతుర్తి : రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. ఇందులో భాగంగానే తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ద్వారా 830 మంది రైతులకు 5.30 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు.
మండల కేంద్రమైన తుంగతుర్తిలో శనివారం జరిగిన రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సంఘం ద్వారా కొత్తగా రైతులకు రూ.ఒక కోటి 80 లక్షల రుణాలు ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరు పై దేశమే దృష్టిని సారించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో వందనపు వెంకటేశ్వర్లు, సిబ్బంది యాదగిరి, ఉమేష్, మహేష్, రైతులు పాల్గొన్నారు.
Advertisement
Next Story