'ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలి'

by S Gopi |
ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలి
X

దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సద్గురు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పీ ఎస్ జిల్లా అధ్యక్షులు భూక్యా సంతోష్ నాయక్, ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 15న ప్రతి తండాలో బోగ్ బండాల కార్యక్రమం నిర్వహించాలని, సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఐదు ఎకరాలలో సేవలాల్ మహారాజ్ మందిరం, బంజారా భవన్ ను నిర్మించాలని, సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర నాయకులు రవి నాయక్, మోహన్ నాయక్, మెగావత్ శేఖర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ వెంకట్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, బర్రె సుదర్శన్, జిల్లా నాయకులు రమేష్ నాయక్, వీరు నాయక్, రాజ్ కుమార్, జైపాల్ నాయక్, శ్రీకాంత్ మరియు ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story