- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లగొండ జిల్లాలో మంత్రి పదవి ఎవరికో..? జాబితాలో ఉన్నది వీరే..!
దిశ, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలంతా సుమారు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వాళ్లే. మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.
నల్లగొండ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు .2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ వెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికలలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని పీసీసీగా ఎంపిక చేసే సమయంలో కోమటిరెడ్డి కూడా ఆ పదవికి పోటీపడ్డారు. ఏడాదిన్నర క్రితం పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీ చేశారు..
కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల తిరిగి సొంతగూటికి చేరు కొని భారీ మెజార్టీతో మునుగోడు నుంచి విజయం సాధించారు. బ్రదర్స్కి ఉమ్మడి జిల్లాలో మాస్ లీడర్లుగా పేరు ఉంది కాని ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డికే పదవి దక్కి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అదే క్రమంలో కోదాడ నుంచి ఎంపికైన ఎన్ పద్మావతి 2014లో కోదాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం అదే నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహిళా కోటలో పద్మావతి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమా చారం. ఉత్తంకుమార్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా ఈమెకి ఇవ్వడం అనేది అసాధ్యం అనే చర్చ కూడా సాగుతుంది.
దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేనావత్ బాలు నాయక్ ఎన్నికయ్యారు. జెడ్పీటీసీగా ప్రారంభమైన రాజకీయ జీవితం ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్‌గా ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గిరిజన కోటాలో బాలు నాయక్ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. సీఎల్పీ సమావేశంలో ఇప్పటికే ఒకరిద్దరి పేర్లు కూడా మంత్రి పదవులకు ప్రపోజల్ చేసి అధిష్టానానికి పంపినట్టు వినికిడి.
ఎమ్మెల్సీ కోటాలో అద్దంకి దయాకర్ కూడా..
ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్‌కు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ టికెట్టు మందుల సామేలుకు కేటాయించిన సందర్భంలో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పని చేస్తానని బహిరంగంగా ప్రకటించిన దయాకర్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేసే క్రమంలో అద్దంకిని పెద్దల సభకు పంపి అటు నుంచి మంత్రివర్గంలోనికి తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రచార సందర్భంలో కూడా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి దయాకర్ కు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని బహిరంగంగానే ప్రకటించిన విష యం అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలోనే దయాకర్‌కు గుర్తింపు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే జిల్లాకు మెజార్టీ స్థాయిలో మంత్రి పదవులు దక్కి అవకాశం కూడా లేకపోలేదు.