- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించండి: గూడూరు నారాయణ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపడుతానంటోందని, కానీ ఇప్పటి వరకు మాటలు చెప్పడం తప్పితే చేతల్లో మాత్రం అది కనిపించడం లేదని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి విమర్శలు చేశారు. ప్రక్షాళన అంటూ పేదల ఇండ్లు కూల్చడం తప్పితే కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిగో ప్రక్షాళన, అదిగో ప్రక్షాళన అంటూ సుందరీకరణపై ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తోంది తప్పితే పటిష్టమైన చర్యలు చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లను కూల్చడానికి బదులు మూసీలోకి మురుగు, ఇతర వ్యర్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్నారు. ఆ తర్వాత సుందరీకరణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. నదిని శుభ్రం చేసిన తర్వాత సుందరీకరణకు మార్గం సుగమమవుతుందన్నారు. క్లీన్ చేసేందుకు వేల కోట్ల డబ్బు కూడా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
నదిలో కాలుష్యం ఎక్కువైందని, నది గుండా వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని అన్నారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఘట్‌కేసర్ నుంచి వలిగొండ వరకు నదీజలాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నియోజకవర్గంలో దాదాపు 48 వేల ఎకరాల్లో సాగవుతున్న వరి కూడా తినలేని పరిస్థితి నెలకొందన్నారు. 250 కిలోమీటర్ల పొడవైన నది ఊహకందని స్థాయిలో కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు. నదీ జలాలు విషంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. నది నీటిలో బాక్టీరియా విపరీతంగా అభివృద్ధి చెందిందని, దానివల్ల సమీపంలో నివసించే వారికి అనేక రకాల చర్మ వ్యాధులు వస్తున్నాయని నారాయణ రెడ్డి తెలిపారు. నది ఒడ్డున గడ్డి మేసే పశువుల నుంచి తీసిన పాలు కూడా కలుషితమవుతున్నాయని, ప్రభుత్వం తొలుత నదిని శుభ్రం చేయాలని కోరారు.