నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలు జైలుకే.. MLA కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-04-17 16:26:24.0  )
నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలు జైలుకే.. MLA కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను హోంమంత్రి అయితే.. బీఆర్ఎస్ నేతలనే మొదట జైలుకు పంపుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి మూడినట్లే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తనకు హోంమంత్రి పక్కా అని కుండబద్దలు కొట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు రాబోతున్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ సైతం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. నకిరేకల్, మునుగోడు తనకు రెండు కళ్లు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేటపై కొంచెం ఫోకస్ పెట్టినా ఈజీగా గెలిచే వాళ్లమని అభిప్రాయపడ్డారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే లీడర్లను నమ్మొద్దని హితవు పలికారు. చామల కిరణ్ కమార్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed