మునుగోడు ఎఫెక్ట్.. మంచిర్యాల ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు (ఆడియో)

by Nagaya |   ( Updated:2023-03-28 14:32:35.0  )
మునుగోడు ఎఫెక్ట్.. మంచిర్యాల ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు (ఆడియో)
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యేకు మునుగోడు ఎఫెక్ట్ పడింది. గతంలో హుజూరాబాద్, ఇప్పుడు మునుగోడులో ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆ నియోజకవర్గాలకు రూ.కోట్ల నిధులు రావడంతోపాటు ఓటర్లకు భారీగా డబ్బులు ముట్టాయి. దీంతో అదేబాటలో నడవాలని అనుకుంటున్నారు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు ఫోన్ చేసి ''సారూ.. మీరు కూడా రాజీనామా చేయండి..'' అంటూ ఓ వ్యక్తి కోరడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టీలోని ఓ వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన ఆడియోలో.. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుని రాజీనామా చేయమని, మన నియోజక వర్గానికి కూడా బై ఎలక్షన్స్ వస్తాయని ఓ అభిమాని ఆతృతతో కోరాడు. గతంలో హుజూరాబాద్‌లో, నేడు మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఆ ప్రాంత వాసులు ఎంతో లబ్ధి పొందుతున్నారని.. రోజుకు వేలల్లో ఇండ్లకు కిరాయిలు, సుక్కా ముక్క అందుతున్నాయని, అలాంటి అవకాశాన్ని తమ నియోజకవర్గ ప్రజలకు కూడా కల్పించాలని ఎమ్మెల్యేను ఆ అభిమాని వాట్సాప్‌లో కోరారు. ప్రస్తుతం ఆ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. మరి దీనిపై ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.


Next Story