- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'RTC కార్మికులకు ఆఫర్ కంటిన్యూ.. హామీ ఇచ్చిన కేసీఆర్'
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులకు మునుగోడు ఉప ఎన్నిక ఆఫర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఎలాగైనా ఆర్టీసీ కార్మికుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ఏండ్ల నుంచి ఉన్న డిమాండ్‌పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం ఆమోదం చెప్పారని తెలిపారు. త్వరలోనే పే స్కేల్ సవరణ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ నుంచి ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశామని, పీఆర్సీ పర్మిషన్ కోసం విజ్ఞప్తి చేశామని ఈ సందర్భంగా చెప్పారు. ఎన్నికల ప్రధానాధికారి నిర్ణయం అనంతరం పీఆర్సీ అమలు చేస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఇప్పటికే డీఏలు, పండుగ అడ్వాన్సులపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2017 నుంచి పీఆర్సీ పెండింగ్ లో ఉందని, దానిపై సీఎం కేసీఆర్ కు వివరించామన్నారు. సంస్థ ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.