BRSకు ములుగు సీటు ప్రతిష్టాత్మకం : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-27 06:51:56.0  )
BRSకు ములుగు సీటు ప్రతిష్టాత్మకం : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి
X

దిశ, మంగపేట : ములుగు అసెంబ్లీ సీటును గెలవడం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీటు గెలిచి ముఖ్యమంత్రి కెసీఆర్‌కు బహుమతి ఇవ్వడమే లక్ష్మంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రం రహదారిలోని ఓ రిసార్టులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గడచిన తొమ్మదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ములుగు సీటును గెలవడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేసిందన్నారు. అందులో బాగంగానే పెద్ద విస్తీర్ణం కలిగిన ములుగులో మెడికల్ కాలేజీ, వంద పడకల ఆసుపత్రి మంజూరు చేసినట్లు తెలిపారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నందున అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో అతర్గత రోడ్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు, సత్యవతీ రాథోడ్‌లు సైతం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంత అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి ఎమ్మెల్యే సీటు కట్టబెట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అందులో భాగంగానే జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి ఆమోదంతో అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు.

ఆమె కోరిక మేరకు నియోజకవర్గంలో పోడు భూములకు పట్టాలు, రైతులకు 24 గంటల కరెంటు, రైతురుణ మాఫీ, రైతుబంధు, దళితబంధు, కళ్యాణలక్ష్మీ, గృహలక్ష్మీ పథకాలను ముమ్మరంగా అందజేసినట్లు తెలిపారు. ములుగు అసెంబ్లీ సీటు బీఆర్ఎస్‌కు హాటు సీటని ఈ సందర్బంగా పోచంపల్లి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ములుగు సీటు గెలిచి ముఖ్యమంత్రికి బహుమతి ఇవ్వడం కోసం ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజవర్గాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారులో పది మంది ఇన్ చార్జులు కనీసం వంద ఓట్ల లక్ష్యంతో నియోజకవర్గంలో పని చేయనున్నట్లు తెలిపారు.

ప్రజలు సైతం బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే ఉంటే ములుగు మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారని బడే నాగజ్యోతిని సుమారు 50 వేల ఓట్లతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అద్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నాయకులు మెట్టు శ్రీనివాస్, కుడుముల లక్ష్మీనారాయణ, పచ్చా శేశగిరిరావు, శ్రీదర్ వర్మ, తోట రమేష్, బండ్లు మధుబాబు, యడ్లపల్లి నర్సింహారావు, చిట్టిమల్ల సమ్మయ్య, సుకుమార్, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed