- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీటీడీ ఆ విషయంలో పునరాలోచన చేయాలి.. ఎంపీ రఘునందర్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ విషయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. టీటీడీ అధికారులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పరిగణలోకి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే (MLA's)లు, ఎంపీ (MP's)లు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఎంపీ రఘునందర్ రావు (MP Raghunandan Rao) స్పందించారు. ఇవాళ ఆయన తిరుమల (Tirumala) శ్రీవారి దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఫిబ్రవరి 1 నుంచి అనుమతిస్తామని టీటీడీ బోర్డు (TTD Board) నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
కానీ, నేటి వరకు తమ లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాడు 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖను అనుమతించే వారిని.. మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఏంటి వివక్ష అని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా టీటీడీ బోర్డు చొరవ తీసుకుని సీఎం ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న సమ్మర్ హాలీడేస్ (Summer Holidays)లో సిఫార్సు లేఖలు ఇస్తామని.. పరిగణలోకి తీసుకోకపోతే తిరుమలకు వచ్చే తేల్చుకుంటామని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు.