- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress MP: మాజీ సర్పంచ్ ఆత్మహత్యతో CM కుటుంబానికి సంబంధం లేదు
దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూల్ పార్లమెంట్(Nagar Kurnool Parliament) పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మల్లు రవి(Mallu Ravi) శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్(BRS) నేతలు అసత్య ప్రచారాలు ఆపాలని కోరారు. తానే స్వయంగా ఆ విలేజ్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేశానని, గ్రామస్తులతో చర్చించానన్నారు.
మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు గ్రామంలో ఆయన ఇంటిలోకి రోడ్ లేకుండా చేశారని ఆరోపణలు చేయడం పూర్తి అవాస్తవమని నొక్కి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వ స్థలంలో పశువుల ఆసుపత్రి నిర్మాణం చేశారన్నారు. ఆయన ఇంటికి దారి కూడా వదిలారని, కానీ, బీఆర్ఎస్ వివాదం లేపుతుందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్(KTR) మళ్ళీ అదే విషయాన్ని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఇంటికి దారి లేనట్టు కేటీఆర్ నిరూపిస్తే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని వివరించారు.