కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై MP క్లారిటీ

by Gantepaka Srikanth |
కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై MP క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పది మంది తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ వస్తోన్న వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) స్పందించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ‘ఎమ్మెల్యేలను ఓ హోటల్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే వింధుకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆ వింధు భేటీలో అనేక అంశాలపై చర్చించారు. పార్టీ వీడే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారనే వార్తల్లో నిజం లేదు. కావాలనే కొందరు తమ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’ అని మల్లు రవి మండిపడ్డారు.

కాగా, ఈ భేటీలో నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్‌ ఎమ్మెల్యే కె.రాజేష్‌ రెడ్డి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం చేశారని మండిపడ్డారు. వీరంతా నిఖార్సైన కాంగ్రెస్ నేతలు అని.. ఎవరూ పార్టీలు మారే వ్యక్తులు కాదని అన్నారు. అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ శ్రేణులకు రాదని అన్నారు.


Next Story

Most Viewed