- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్: బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌పై MP లక్ష్మణ్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలపై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు.
అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోందని చెప్పారు. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను సెలక్షన్ చేస్తామన్నారు. అవసరమైన చోట బీజేపీ సీనియర్ నేతలు కూడా బరిలో ఉంటారని లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని.. బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందన్నారు. బీసీ వ్యక్తి సీఎం అయ్యే అవకాశం ఒక్క బీజేపీలోనే ఉందన్నారు.