కేసీఆర్ ప్రతీ స్కీమ్ లో స్కామ్.. ఎంపీ లక్ష్మణ్

by Javid Pasha |
కేసీఆర్ ప్రతీ స్కీమ్ లో స్కామ్.. ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ అమలు చేస్తోన్న ప్రతీ స్కీంలో స్కాంలు దాగున్నాయని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. కుత్బుల్లాపూర్ లో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని విమర్శలు గుప్పించారు. దళితబంధులో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని, మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని.. తొమ్మిదేళ్ళల్లో ప్రధాని మోడీ చేసి చూపించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ సొంత కుటుంబం కోసమే పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. పేదలకు పక్కా ఇళ్ళు కట్టించిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదేనని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబం కోసం పనిచేస్తే.. దేశం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమేనని తెలిపారు.

Advertisement

Next Story