Chamala Kiran: బీజేపీకి జై కొడితేనే.. అవార్డులిస్తారా? కేంద్ర మంత్రికి ఎంపీ చామల కౌంటర్

by Ramesh N |
Chamala Kiran: బీజేపీకి జై కొడితేనే.. అవార్డులిస్తారా? కేంద్ర మంత్రికి ఎంపీ చామల కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా బీజేపీకి జై కొడితేనే.. పద్మ అవార్డులు ఇస్తారా? అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ (Gaddar) గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు. ఆయన ఒక కేబినెట్ మినిస్టర్ అని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైట్ వింగ్, బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకే పద్మ అవార్డులు ఇస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నారని అయితే (BJP) బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ గొంతు పలికిన వారికే అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రాష్ట్రంపై కేంద్రం వివక్షత చూపుతూనే ఉందని ఆరోపించారు. (Padma Awards) పద్మ అవార్డుల విషయంలో ప్రభుత్వ సిఫార్సులను విస్మరించి.. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణ 8 మంది ఎంపీలను అందించినప్పటికీ, కేంద్రం రాష్ట్రాన్ని గుర్తించడంలో విఫలమైందన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు, విభజన హామీలను రాబోయే బడ్జెట్‌లో విడుదల చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుందని, లేదని పక్షంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Next Story

Most Viewed