MP Kiran: రేపు వారి యోగక్షేమాలు సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటారు

by Gantepaka Srikanth |
MP Kiran: రేపు వారి యోగక్షేమాలు సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటారు
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొత్తం సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) గురువారం మీడియాకు వివరించారు. ‘రేపు ఉదయం 8:45 గంటలకు కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

స్వామివారి దర్శనం అనంతరం 10:00 గంటలకు ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటలకు వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుంటారు. మూసీ పరివాహక ప్రాంత రైతులతో మూసీనది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శిస్తారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంత రైతులతో సమావేశం అవుతారు. మూసీ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement
Next Story