- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.. హరీష్ రావుకు MP చామల కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు తెలంగాణ కీలక నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘మీరు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేసే వ్యభిచారమా హరీష్ రావు గారు.. కేసీఆర్ మాట్లాడితే నీతులు.. ఎదుటి వాళ్ళు మాట్లాడితే భూతులా?’ అని ప్రశ్నించారు. భారతదేశంలో బూతు పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది కేసీఆర్(KCR)కే ఉంటుంది. గత పది సంవత్సరాలలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ ఎన్నో బూతు మాటలు, తిట్లు తిడుతూ ఒక బూతు పుస్తకమే రాసి ఉండొచ్చు. అలాంటి మీరు ఇవాళ నీతులు చెబుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. రేవంత్ రెడ్డి(CM Revanth Redy) మాటల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదనే విషయం గుర్తుంచుకోవాలి.
ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలనను అందిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. నిండు అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోలేదు. మనం ఎదుటివారిని అనేముందు.. ఇతరులు గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. మేము అధికారంలోకి వచ్చాక ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామనేది యువతకు తెలుసు, రుణమాఫీ గురించి రైతులకు తెలుసు. పదే పదే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. తరచూ సవాళ్లు చేయడం ఆపేయ్’ అని హరీష్ రావుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.
Read More..
Harish Rao: కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే.. రేవంత్ రెడ్డి బూతుపిత