MP Arvind: వాళ్లను నమ్ముకుంటే రేవంత్ రెడ్డి నట్టేట మునుగుడే: ఎంపీ అర్వింద్

by Prasad Jukanti |
MP Arvind: వాళ్లను నమ్ముకుంటే రేవంత్ రెడ్డి నట్టేట మునుగుడే: ఎంపీ అర్వింద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అజిరెడ్డికి ఎమ్మెల్సీగా ఇది ఫస్ట్ ఎలక్షన్, టీచర్ ఎమ్మెల్సీ మల్కకొమురయ్యకు రాజకీయమే కొత్త. కానీ ఈ ఇద్దరు విజయం సాధించారంటే అది బీజేపీ క్షేత్రస్థాయి కార్యకర్తల పనితీరు, మా సుప్రీం లీడర్ నరేంద్రమోడీ ఇమేజ్ కారణం అన్నారు. ఇవాళ నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు ఉండబోతున్నాయన్నారు. అందువల్ల ఓడిపోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు టికెట్లు కూడా అడగవద్దని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ ఎలాగే పోటి చేయడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి మంత్రి శ్రీధర్ బాబు ఏదో ఓసాకు వెతుకుంటున్నారని విమర్శించారు.

ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని అక్కడ బీజేపీ గెలుస్తారన్నారు. నిన్న ఆలస్యంగా సమాచారం ఇచ్చి అఖిలపక్ష సమావేశానికి రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం హాజరవుతారని డిప్యూటీ సీఎం నేతృత్వం వహిస్తారని సమాచారం ఇచ్చారు. సీఎం పక్కన ఉండగా డిప్యూటీ సీఎం ఎలా అధ్యక్షత వహిస్తారని ఇది ప్రోటోకాల్ కాదన్నారు. మేము రాజకీయాలకు అతీతంగా పని చేస్తుంటే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాల్లో అడ్డుపుల్లలు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పని చేయరు చేసేవాళ్లను చేయనివ్వడం లేదు. ఇలాంటి వాళ్లను నమ్ముకుంటే రేవంత్ రెడ్డి (Revanth Reddy) నట్టేట మునుగుతారని జోస్యం చెప్పారు.



Next Story

Most Viewed