Mohanbabu: మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి.. మూడు చోట్ల బోన్ ఫ్రాక్చర్

by Shiva |
Mohanbabu: మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి.. మూడు చోట్ల బోన్ ఫ్రాక్చర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లోని జల్‌పల్లి (Jalpally)లో మోహన్ ‌బాబు (Mohanbabu) ఇంటి వద్ద కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆయన చిందులు తొక్కారు. ఏకంగా ఓ ప్రముఖ మీడియాకు చెందిన ప్రతినిధి రంజిత్ (Ranjith) నుంచి మైక్ లాక్కొని ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రిపోర్టర్‌ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న వారు ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, రంజిత్ దవడ పైభాగంలో ఉండే జైగోమాటిక్ బోన్ (Zygomatic Bone) మూడు చోట్ల విరిగినట్లుగా స్కానింగ్‌లో తేలిందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా రంజిత్‌కు వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story