మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య మళ్లీ గొడవ.. ఈసారి ఏకంగా కలెక్టర్ ఎదుటే దూషణలు

by Gantepaka Srikanth |
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య మళ్లీ గొడవ.. ఈసారి ఏకంగా కలెక్టర్ ఎదుటే దూషణలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీ(Manchu Family)లో మొదలైన గొడవలు ఇప్పుడప్పుడే సర్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా మరోసారి మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj) గొడవ పడ్డారు. సోమవారం ఏకంగా కలెక్టర్ ఎదుటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో మోహన్‌బాబు వేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్(Collector Pratima Singh) ఇవాళ ఇద్దరినీ విచారణకు పిలిచారు. ముందు ఒకరి తర్వాత ఒకరితో వేర్వేరుగా కలెక్టర్ మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరినీ కలిపి సమస్యను తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఎదురుపడటంతో ఆవేశం ఆపుకోలేక తండ్రి, కొడుకు ఏకంగా కలెక్టర్ ఎదుటే దూషించుకున్నట్లు సమాచారం.

దాదాపు 2గంటల పాటు జిల్లా మేజిస్ట్రేట్‌(District Magistrate) ఇద్దరినీ విచారించారు. తాను కష్టపడి సంపాదించుకున్నానని.. దానిపై మనోజ్‌కు ఎటువంటి హక్కు లేదని.. నా ఆస్తులు నాకు అప్పగించాలని కలెక్టర్ ఎదుట మోహన్ బాబు వాపోయినట్లు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత మోహన్‌ బాబు, మనోజ్‌ మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వచ్చేవారం మళ్లీ విచారణకు హాజరు కావాలని కలెక్టర్ ఇద్దరినీ ఆదేశించారు. కాగా, రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం జల్‌పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్‌ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని పిటిషన్‌లో మోహన్ బాబు పేర్కొన్నారు.



Next Story

Most Viewed