- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kishan Reddy : దేశానికి అన్నం పెట్టే రైతుకు మోడీ అండ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : దేశానికి అన్నం పెట్టె రైతుకు ప్రధాని మోడీ(PM Modi) అండగా ఉంటారని బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలియ జేశారు. నేడు రైతులకు పీఎం కిసాన్ నిధులను(PM Kisan Funds) ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) విడుదల చేయనున్నారు. బీహార్లో(Bihar)ని భాగల్పూర్ లో జరుగనున్న ఓ కార్యక్రమంలో 19వ విడత రైతులకు రూ.22 వేల కోట్ల పీఎం కిసాన్ నిధులను మోడీ విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ నిధుల విడుదలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. దేశానికి అన్నం పెట్టే ప్రతి రైతుకు అండదండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి(PM Kisan Samman Funds) ఉంటుందని పేర్కొన్నారు. గత 6 సంవత్సరాలుగా రైతులకు ప్రధాని మోడీ రైతులకు ఇస్తున్న భరోసా ఇదని స్పష్టం చేశారు.
మధ్యవర్తుల లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ₹3.5 లక్షల కోట్లు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఫసల్ బీమా యోజన కింద రైతులకు పంట భద్రత కోసం ₹1.72 లక్షల కోట్లు చెల్లింపు చేశామని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహిస్తూ పంట ఉత్పత్తికి భరోసా కల్పించేందుకు 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. కిసాన్ సమ్మాన్ కింద దాదాపు 85% చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని రైతులు పెట్టుబడి ప్రోత్సాహాకాలతో, ప్రత్యక్ష ప్రయోజనాలు పొందుతూ.. ధైర్యంగా పంటలు సాగు చేస్తున్నారని కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.