- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోకల్ ట్రైన్ మంజూరు చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ పోచంపల్లి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: జనగామ జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాదిమంది ప్రజలు ఉపాధికోసం వెళ్తుంటారని.. వారి సౌకర్యార్ధం లోకల్ ట్రైన్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. జనగామ, ఆలేరు, భువనగిరి పట్టణాలతో పాటు పెంబర్తి, వంగపల్లి, రాయగిరి, బీబీనగర్, ఘట్ కేసర్‌ల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రైలు టికెట్ అందుబాటులో ఉండటంతో పాటు సులువుగా గమ్యస్థానాన్ని చేరుకుంటారన్నారు.
కానీ అందుబాటులో ఉన్న రైల్లు నిత్యం రద్దీతో వెళ్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా లోకల్ ట్రైన్ వేస్తే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. యాదాద్రి భువనగిరి వరకు విస్తరిస్తున్న ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్‌ను కూడా జనగామ వరకు పొడిగిస్తే భవిష్యత్‌లో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్న తరుణంలో చర్చించి ఎంఎంటీస్ రైల్వే లైన్‌తో పాటు లోకల్ ట్రైన్‌ను అత్యవసరంగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.