- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీబీఐపై సీరియస్.. కోర్టును ఆశ్రయించనున్న MLC కవిత
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత మరోసారి కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తరపు తరపు న్యాయవాది మోహిత్ రావు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారించాలని ఈ సందర్భంగా కోర్టును కోరనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆమెను గురువారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. రేపు (శుక్రవారం) కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. తీహార్ జైలులో ఏప్రిల్ 6న కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, విచారణకు సహకరించకపోవటంతో, ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు మార్చి 15న ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేసిన విషయం తెలిసిందే.