- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నితీష్ కుమార్‌పై MLC కవిత సీరియస్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె బిహార్‌లో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ఉండదని తాము ముందుగానే చెప్పామని అన్నారు. కూటమి జాతీయ స్థాయిలో నిలదొక్కుకోలేదని అన్నారు.
నితీష్ కుమార్ స్వార్థ రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను అగమ్యగోచరంగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పారు. బలమైన ప్రతిపక్షం క్రమంగా బలహీన పడుతోందని అన్నారు. ఇప్పుడు దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం అని అభిప్రాయప్డడారు. బీఆర్ఎస్ లాంటి పార్టీలకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. దేశంలో కుల గణన జరగాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని కీలక వ్యాఖ్యలు చేశారు.