- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారు? ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై నిన్న స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎక్స్ వేదికగా ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర ట్వీట్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy)ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారు ? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా ? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి ఇంత అసహనం పనికిరాదు.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. తక్షణమే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.